Take a fresh look at your lifestyle.

మహా చండీదేవిగా కనకదుర్గమ్మ

0 14

నవరాత్రుల్లో నాలుగో రోజు శ్రీ కనకదుర్గమ్మ మహా చండీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. దుష్టశక్తుల సంహారం, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా భావించే ఈ రూపం వెనుక ఉన్న విశేషాలు, పూజా సంప్రదాయాలు, పఠించాల్సిన శ్లోకాలను తెలుసుకుందాం. ఆశ్వయుజ మాసం రాగానే ఇంద్రకీలాద్రి భక్తజనసందోహంతో నిండి పోతుంది. దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారి దర్శనం కోసం భక్తులు దేశవిదేశాల నుంచి తరలి వస్తారు. అమ్మవారిని రోజుకో రూపంలో దర్శించి భక్తులు పులకించి పోతారు. ఈ నేపథ్యంలో దసరా నవరాత్రులలో నాలుగో రోజు అవతార విశేషమైన చండీదేవి అలంకార విశిష్టత గురించి తెలుసుకుందాం.

చండీదేవిగా కనకదుర్గ!్మ
శరన్నవరాత్రి మ త్సవాల్లో నాలుగో రోజు శ్రీ కనకదుర్గమ్మ శ్రీ మహా చండీదేవిగా దర్శనమిస్తారు. పూర్వం అసురశక్తి విజృంభించిన సమయంలో అసుర సంహారం కోసం, దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి అనే త్రిశక్తి స్వరూపంగా శ్రీ మహా చండీ అమ్మవారు ఆవిర్భవించారు. అనంతరం శ్రీ మహా చండీ దేవి రాక్షసులను దునుమాడి అసుర శక్తి నుంచి దేవతలను రక్షించి అభయమిచ్చారు.
త్రిశక్తి స్వరూపిణి:శ్రీ మహా చండీ దేవి అవతారం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే ముగ్గురు అమ్మవార్ల శక్తుల కలయికగా ఆవిర్భవించింది. అందుకే శ్రీ మహా చండీ దేవి స్వరూపానికి త్రిశక్తి స్వరూపిణి అని పేరుంది.సర్వ దేవతా స్వరూపం:శ్రీ మహా చండీదేవిలో అనేక దేవతలు కొలువై ఉన్నారని దేవి భాగవతంలో వివరించి ఉంది. శ్రీ మహా చండీదేవిని ప్రార్ధిస్తే సర్వ దేవతలను ప్రార్ధించినట్లే అని శాస్త వచనం.
దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ
రాక్షసులను దునుమాడి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే బాధ్యతను వహించింది.
అందుకే ఈ తల్లిని సకల రాక్షస సంహారిణిగా, దుర్గాదేవి అత్యంత శక్తివంతమైన ఉగ్ర రూపంగా భావిస్తారు.

నీలాచల పర్వతంపై వెలసిన మహా చండీ దేవి రాక్షస సంహారం అనంతరం శ్రీ మహా చండీ దేవి హిమాలయ సానువుల్లో నీలాచల పర్వతంపై వెలసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో నీలాచల పర్వతంపై వెలసి ఉన్న చండీదేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో శారదీయ నవరాత్రుల్లో వచ్చే అష్టమి, నవమి రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి.

పూజా ఫలం
దేవి నవరాత్రులలో అమ్మవారిని చండీ దేవి అలంకారంలో దర్శించుకుని పూజిస్తే విద్య, కీర్తి, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. అంతేకాదు శ్రీ మహా చండీ దేవి అనుగ్రహం వలన కీర్తి సంపదలు, లభిస్తాయని, శత్రువులు కూడా మిత్రులుగా మారుతారని, భక్తుల సకల సంకల్పాలు నెరవేరి విజయం సిద్ధిస్తుందని విశ్వాసం.

ఏ రంగు వస్తం? ఏ పూలు?
శరన్నవరాత్రుల్లో నాలుగో రోజు శ్రీ మహా చండీ దేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారికి ఈ రోజు ఎరుపు రంగు లేదా బంగారు రంగు చీరను సమర్పించాలి. ఎర్ర కలువ పూలతో పూజించాలి.

ఏ నైవేద్యం?
శ్రీ మహా చండీ దేవికి ఈ రోజు కట్టు పొంగలి, చక్కెర పొంగలి, కదంబం, పులి ర, లడ్డులు, రవ్వ కేసరి వంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి.

పఠించాల్సిన గ్రంథాలు
శరన్నవరాత్రులలో నాలుగో రోజు శ్రీ మహా చండీ దేవి అనుగ్రహం కోసం దుర్గా సప్తశతి, చండీ సప్తశతి, లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం పఠించడం అత్యంత శుభప్రదం.

ఈ శ్లోకం పఠించాలి
యా చండీ మధుకైటభాదిదైత్యదలనీ యా మాహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షణచండముండమథనీ యా రక్తబీజాశనీ G
శక్తిః శుంభ నిశుంభ దైత్యదలనీ యా స్మర్యతే యోగిభిః
సా మాం పాతు సరస్వతీ భగవతీ దుర్గా జగన్మంగళా GG

అనే శ్లోకాన్ని పఠించడం వలన శ్రీ మహా చండీ దేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. మనం కూడా ఈ దేవి నవరాత్రుల్లో శ్రీ మహా చండీ దేవిని పూజించి దేవి అనుగ్రహాన్ని పొందుదాం.

ఓం శ్రీ మాత్రే నమః

Leave A Reply

Your email address will not be published.