Take a fresh look at your lifestyle.

ఇచ్చిన హామీని నెరవేర్చిన ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

0 4

(మెట్రో న్యూస్):
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని 10వ వార్డు మహిళలకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీజే బాక్స్ సెట్‌ను ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. మైలారం గ్రామంలోని 10వ వార్డు మహిళలకు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు గురువారం డీజే బాక్స్ సెట్‌ను అందజేశారు. మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ డీజే బాక్స్ సెట్‌ను అందించడంతో వార్డు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ముందుంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రజలకు ఎంతగానోఉపయోగపడుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, కోలా సంపత్, నందనబోయిన యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.