Take a fresh look at your lifestyle.

సాయన్న పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం.

0 4

మెట్రో న్యూస్.

  • పేదల పక్షాన నిలిచిన ప్రజావీరుడు పండుగ సాయన్న.
  • ఆయన పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం.
  • జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్.

భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల జానపద చరిత్రలో పేదల పక్షాన నిలిచి, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజావీరుడిగా పండుగ సాయన్న ప్రత్యేక గుర్తింపు పొందారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పేదలకు అండగా నిలవడం, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడటం ఆయన జీవితంలో ప్రధానమైన విలువలని తెలిపారు. పండుగ సాయన్న జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, సమాజంలో సమానత్వం, మానవత్వం, సేవాభావం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ, బలహీన వర్గాలకు అండగా నిలవడం ద్వారా ఆయన ఆశయాలను భావితరాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, ఆర్‌ఐలు కాశీరాం, పూర్ణచందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నరు.

Leave A Reply

Your email address will not be published.