Take a fresh look at your lifestyle.

తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురిపై పోలీసుల కేసులు

0 2

హైదరాబాద్ (మెట్రో న్యూస్):

శాసనసభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్దిలను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం వారి వారి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నివాసం వద్ద హై టెన్షన్.. నెలకొంది. ఆయన నివాసానికి పోలీసులు భారీగా చేరుకున్న విషయం తెలిసి బీఆర్ఎస్ నాయకులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. చివరకు తాతా మధును పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషనుకు తరలించారు.

మరోవైపు కేటీఆర్, హరీశ్ రావు సహా మొత్తం 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పైనే కేసు నమోదు చేశారు. సోమవారం అసెంబ్లీ ముందు జరిగిన రభసలో తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలతో పాటు
కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సంజయ్, గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, విజయుడు, శంభీపూర్ రాజు తదితరులపై కేసు నమోదైంది.
సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో 121(1), 132, 74, 79, 351, 352, 353 ఆర్/డబ్ల్యు 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.