(మెట్రో న్యూస్):
తాడ్థాన్ పల్లి ఎక్స్ రోడ్డులోని ఎం ఎస్ ఫంక్షన్ హాల్లో అక్టోబరు 23 శుక్రవారం ఉదయం11గంటలకు దసరా పండుగ సందర్భంగా నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ,కార్యక్రమాని మండలంలోని నాయకులు,కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ఆహ్వానితులేనని కార్యక్రమానికి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాయికోడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోల కేదార్ నాథ్ పాటిల్ కోరారు.రాయికోడ్ మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు,నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు అలాయ్ బలాయ్ కార్యక్రమానికి అథిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.మాజీ జడ్పీటీసీ సభ్యులు,మాజీ యంపిపిలు,మాజీ ఏయంసి చైర్మన్లు,మాజీ పిఏసిఎస్ చైర్మన్లు,ప్రస్తుత ఏయంసి చైర్మన్,ప్రస్తుత పిఏసిఎస్ చైర్మన్,ఆత్మ కమిటీ చైర్మన్,మండల సీనియర్ నాయకులు,అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు,మాజీ సర్పంచులు,మాజీ యంపిటిసి సభ్యులు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు,బిసి,ఎస్సీ, మైనారిటీ విభాగాల అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు,ఏయంసి డైరెక్టర్లు,ఆత్మ కమిటీ డైరెక్టర్లు,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ బిఏల్ఏ,సూపర్వైజర్లు,ఉప సర్పంచులు,వార్డు సభ్యులు,ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు, సభ్యులు,ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,సీడీఆర్ అభిమానులు,త్రిషమ్మ అభిమానులు,వివిధ సంఘాల నాయకులు,ప్రజాప్రతినిధులు,మండలంలోని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకతాటిపై నిలిచి,తమ వారందరినీ దసరా అలాయ్ బలాయ్ కార్యక్రమానికి కార్యకర్తలను,అభిమానులను తీసుకొని రావాలని కోరారు.