తిరుమల (మెట్రో న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆయన, మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు డిప్యూటీ సీఎం భట్టికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం అధికారులు స్వామివారి శేష వస్త్రంతో ఆయనను సత్కరించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆదివారమే తిరుమల చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి… శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.