Take a fresh look at your lifestyle.

సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెస్తున్నాడు : కేటీఆర్

0 3

అమెరికా పర్యటనలో సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి తెలంగాణ‌కు పెట్టుబడులు తెస్తున్నాడ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టింది. ఫోర్త్ సిటీలో అక్రమంగా కట్టబెట్టిన భూమిని హ‌రీశ్ రావు, బీఆర్ఎస ఎమ్మెల్యేల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ది గ్రేట్ అనుముల రేవంత్ రెడ్డితో ది గ్రేట్ పారిశ్రామికవేత్త అనుముల జగదీశ్వర్ రెడ్డితో రూ.1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఇలా అనుముల జగదీశ్వర్ రెడ్డికి రూ.1000 కోట్లు, అనుముల కొండల్ రెడ్డికి రూ.250 కోట్లు ఇవ్వడమేనా ప్రజాపాలన అని ప్ర‌శ్నించారు. అనుముల అన్నదమ్ముల దోపిడీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడటం లేద‌ని నిల‌దీశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని బీజేపీ వాళ్ళు అంటారు.. మరి దొంగని పట్టుకోవాల్సిన కేంద్ర‌ హోమ్ మంత్రి ఎక్కడ ఉన్నాడని సూటిగా ప్ర‌శ్నించారు.

ఇజ్రాయెల్ తో ఒప్పందం చేసుకుంటే రాహుల్ గాంధీ మోడీని ప్రశ్నించాడు.. అదే రేవంత్ రెడ్డి ఇజ్రాయెల్ తో ఒప్పందం చేసుకుంటే నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు ఈడీ విచారణకు, సీబీఐ విచారణకు ఆదేశించడం లేద‌న్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి పొంగులేటి కూడా రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అని స్టార్ట్ చేశాడు. ఇలా కాంగ్రెస్ అవినీతి, అక్ర‌మాల‌ను శాసనసభలో ప్ర‌శ్నిస్తార‌నే భ‌య‌ప‌డి మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. ఇలాంటి వాటికి భ‌య‌ప‌డ‌మ‌ని ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌భుత్వ అవినీతిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.