Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

0 20

(మెట్రో న్యూస్):

ప్రారంభించిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.శిక్షణ కార్యక్రమాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, టి యు డబ్ల్యూ జే యూనియన్ జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ తదితరులు ముఖ్య అతిథులుగా పాలొని ప్రారంభించారు.ఈ సందర్భంగా జర్నలిజంలో వృత్తి నైపుణ్యాల ప్రాధాన్యత, మారుతున్న మీడియా రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, వార్తల సేకరణ, సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేరవేసే విధానాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో మీడియా రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.