Take a fresh look at your lifestyle.

కోకాపేటలోని నివాసంలో హరీశ్ రావు హౌస్ అరెస్ట్

0 17
  • సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు పిలుపునిచ్చిన హరీశ్ రావు
  • ముందస్తు జాగ్రత్త చర్యగా హరీశ్ రావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు కోకాపేట్‌లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆస్పత్రిని సందర్శించేందుకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు.

ఈ పర్యటన పిలుపు నేపథ్యంతో తెల్లవారుజాము నుంచే కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హరీశ్ రావు ఇల్లు విడిచి బయటకు రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది. ఈ ఆకస్మిక పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా… హరీశ్ రావు హౌస్ అరెస్ట్ వార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.