Take a fresh look at your lifestyle.

ఏపీలో 1156 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

0 3

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌  1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా పోలీస్‌, ఫైర్‌ సర్వీస్‌, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్‌ (సివిల్‌, ఏఆర్‌), ఫైర్‌మెన్‌, వార్డర్‌ పోస్టులను నింపనుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులై, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉన్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు
పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో స్టైపెండరీ క్యాడెట్‌ట్రైనీ (SCT) పోలీస్‌ కానిస్టేబుల్‌ (సివిల్‌) (పురుషులు, మహిళలు)- 542
పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో SCT కానిస్టేబుల్‌ (ఏఆర్‌) (పురుఫులు, మహిళలు)- 285
డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఫైర్‌మెన్‌- 158
ప్రిజన్స్‌ అండ్‌ కరెక్షనల్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌లో వార్డర్లు (పురుషులు)- 150
ప్రిజన్స్‌ అండ్‌ కరెక్షనల్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌లో వార్డర్లు (మహిళలు)- 21
పై పోస్టుల్లో ఈ 1156 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు
ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఈ ఏడాది జూలై 1 నాటికి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు పదో తరగతి పాసై, ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం చదివి పరీక్షలకు హాజరై ఉండాలి. వీటితో పాటు నిర్దేశించిన శారీరక, వైద్య ప్రమాణాలు ఉండాలి.

వయసు
ఈ ఏడాది జూలై 1 నాటికి కానిస్టేబుల్‌, సివిల్‌, ఏఆర్‌లకు 18 నుంచి 24 ఏండ్లలోపు ఉండాలి. మిగతా పోస్టులకు 18 నుంచి 32 ఏండ్లలోపు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌లకు 5 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది. ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ప్రభుత్వ ఉద్యోగులు, వితంతువులకు నిర్దేశించిన సడలింపులు ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మొదట రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి దరఖాస్తు పూర్తి చేయాలి. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన తరువాత స్టేజ్‌-II దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ. 300. ఎస్టీ, ఎస్టీలకు రూ. 150.

ఎంపిక
ప్రిలిమినరీ పరీక్ష, దేహదారుఢ్య ప్రమాణాల పరీక్ష,  మెయిన్స్‌ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ (200 మార్కులు), మెయిన్స్‌ (200 మార్కులు)లో ఇంగ్లిష్‌, అర్థమెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, ఇండియన్‌ హిస్టరీ, కల్చర్‌, నేషనల్‌ మూవ్‌మెంట్‌, ఇండియన్‌ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

Leave A Reply

Your email address will not be published.