Take a fresh look at your lifestyle.

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

0 2

(మెట్రో న్యూస్) 

ధాన్యం కొనుగోల సమయంలో ప్రభుత్వం ముందు చూపు లేక రైతులు అనేక సమస్యలకు గురయ్యారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో సిరిపురం గోవిందరాజ్ పల్లి లింగాపూర్ కొన్యాల హత్నూర దౌల్తాబాద్ నవపేట్ గ్రామాలలో ఐకెపి, పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టే సమయంలో తీసుకోవలసిన చర్యలను సరైన సమయంలో తీసుకోకపోవడంతో రైతులు అనేక సమస్యలకు గురయ్యారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దాన్యం తీసుకువచ్చి రోజులు గడిచిన కొనుగోలు చేయకపోవడంతో పాటు ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాటు చేయక అనేక సమస్యలు ఎదురైనట్లు తెలిపారు.
అంతేకాకుండా కొన్నిచోట్ల తూకంలో మోసాలు చేయడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి అన్నారు. సకాలంలో గన్ని బ్యాగులు సైతం సక్రమంగా అందజేయలేక ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభం అవుతుండడంతో ఇప్పటికైనా ప్రభుత్వం ముందు చూపుతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.
ప్రస్తుతం ఎలినో ప్రభావంతో వేసిన పంటలు ఎక్కడికక్కడ ఎండిపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని రైతులకు పంట నష్టపరిహారం కింద ప్రభుత్వం ఎకరాకు 30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా అధికారులు చరోచూపాలని ఆమె సూచించారు.కార్యక్రమంలో డిపిఎం వెంకటేశం,తహశీల్దార్ పర్వీన్ షేక్, వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఏపిఎం రాజశేఖర్, ఆర్ఐ రంగయ్య, సీఈఓ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సింలు, జెడ్పిటిసి ఆంజనేయులు, బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, హత్నూర సర్పంచ్ ఎల్లయ్య, దౌల్తాబాద్ ఉప సర్పంచ్ పటేల్ శేఖర్ గౌడ్, యువత మండల మాజీ అధ్యక్షులు కిషోర్, మాజీ వైస్ ఎంపీపీ చేన్న నరసింహులు, మాజీ సర్పంచ్ లు దూడి పోచయ్య,మచ్చ నరేందర్, నాయకులు నరసింహారెడ్డి, కృష్ణ యాదవ్, ఆగమయ్య, ఇబ్రహీం, మాయిని శ్రీకాంత్, మాయిని వీరేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఐకెపి, సిబ్బంది నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.