(మెట్రో న్యూస్):
రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. భూత్పూర్ సబ్‌స్టేషన్ వద్ద రైతులకు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, నియోజకవర్గంలోని వివిధ మండలాల రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు. అలాగే భూత్పూర్ మున్సిపాలిటీలో రూ.35 లక్షలతో నిర్మించనున్న విద్యుత్ సెక్షన్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.
ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జీఎంఆర్ సూచించారు. బోర్లపై ఆధారపడుతున్న రైతులకు లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. స్ప్రింక్లర్ల వినియోగంతో నీటి వృథాను తగ్గించి, పంటలకు అవసరమైన నీటిని సమర్థంగాఅందించవచ్చన్నారు. పంట రకం, నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలనిసూచించారు.ఈసందర్భంగా బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన జీఎంఆర్.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందనివిమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పదేళ్ల పాలనలో పూర్తి చేసి ఉంటే పాలమూరు రైతులకు సాగునీటి కష్టాలు ఉండేవి కావన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన గత పాలకులు పాలమూరు ప్రజల జీవనాడి అయిన ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదని హరీశ్‌రావును ప్రశ్నించారు.
అనంతరం రూ.35 లక్షలతో నిర్మించనున్న విద్యుత్ సెక్షన్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. నూతన కార్యాలయంతో విద్యుత్ శాఖ పరిపాలనా కార్యకలాపాలు సులభతరమై ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయనిపేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు, అధికారులు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.