Take a fresh look at your lifestyle.

ఓడిపోతే పరువు పోతది

0 14
  • బీజేపీకి రిస్కే!
    ఎమ్మెల్సీ బరిలో
    రామచంద్రరావు

తెలంగాణలో త్వరలో జరగనున్న మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావును మళ్లీ బరిలోకి దించాలనే చర్చలు కాషాయ దళంలో కలకలం రేపుతున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పార్టీని నడిపించాల్సిన అత్యున్నత పదవిలో ఉన్న నేతను.. ఇలా ఒక నిర్దిష్ట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రత్యక్ష పోటీకి దింపడం తీవ్రమైన రాజకీయ సాహసమేనని భావిస్తున్నారు. సాధారణ నాయకుడిగా పోటీ చేయడం వేరు, స్వయంగా పార్టీ రాష్ట్ర సారథిగా ఉండి ఎన్నికల పరీక్షను ఎదుర్కోవడం వేరు. ఒకవేళ ఇక్కడ ఫలితం ఏమాత్రం ప్రతికూలంగా వచ్చినా, ఆ ప్రభావం కేవలం రామచంద్రరావు రాజకీయ ప్రతిష్టకే కాకుండా, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ సమష్టి ఆత్మస్థైర్యంపై పిడుగుపాటులా పడుతుంది.
ఈ స్థానంలో గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే..

ఆయనకు ఇది ఏమాత్రం పూలబాట కాదన్న పచ్చి నిజం అర్థమవుతుంది. 2015లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి శాసనమండలిలో బీజేపీ గళాన్ని బలంగా వినిపించిన ఆయన, 2021లో జరిగిన  రా రీ పోరులో టీఆరఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి చేతిలో ఏకంగా 44 వేల పైచిలుకు ఓట్ల భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. ఒకసారి విజయం, మరోసారి భారీ పరాజయం చూసిన ట్రాక్ రికార్డు ఉన్న నేపథ్యంలో.. విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉండే ఈ నియోజకవర్గంలో గెలుపు అనేది ముందస్తుగా అంచనా వేయలేని సంక్లిష్టమైన అంశం. పట్టభద్రుల మÖడ్ ఎప్పటికప్పుడు మారిపోతుండే ఇలాంటి సెన్సిటివ్ స్థానంలో.. స్వయంగా పార్టీ అధినేతను బరిలో దింపి డూ ఆర్ డై’ స్థితిలోకి నెట్టడం వ్యూహాత్మకంగా సరైనది కాదని ఎక్కువ మంది భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సీటును ఎవరైనా కొత్త ముఖానికి, ముఖ్యంగా విద్యార్థి, యువజన ఉద్యమాల్లో చురుగ్గా పనిచేస్తున్న యÖత్ లీడర్‌కు కేటాయించడం ద్వారా బీజేపీ మెరుగైన ఫలితాలను రాబట్టే అవకాశం ఉంది. ఏబీవీపీ, యువమోర్చా నేపథ్యం ఉన్న బలమైన యువ నాయకుడిని బరిలోకి దించితే.. కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిరుద్యోగ యువతను, గ్రాడ్యుయేట్లను ఆకట్టుకోవడం సులువవుతుంది. కొత్త నాయకుడిని నిలబెడితే ఎన్నిక ఎలా ఉన్నా పార్టీ కేడర్ అంతా సంఘటితంగా పోరాడుతుంది; ఒకవేళ ఫలితం తేడా వచ్చినా అది ఒక సాధారణ నియోజకవర్గ ఫలితంగానే చూస్తారు తప్ప పార్టీ రాష్ట్ర నాయకత్వంపై వైఫల్య ముద్ర పడదు. కానీ రామచంద్రరావు రంగంలోకి దిగితే.. ప్రత్యర్థి పార్టీలన్నీ కలిసి ఉమ్మడిగా ఆయనను ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతాయి, ఫలితంగా రాష్ట్ర అధ్యక్షుడి ఇమేజ్ లాక్ అయిపోతుంది.

అది రామచంద్రరావు నాయకత్వ సామర్థంపైనే కాకుండా, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ప్రధాన ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న బీజేపీ రాజకీయ ఉనికికే గొడ్డలిపెట్టుగా మారుతుంది. రాష్ట్ర అధ్యక్షుడు తన సొంత సీటునే కాపాడుకోలేకపోయారంటూ ప్రత్యర్థులు చేసే దాడి బీజేపీ క్షేత్రస్థాయి శ్రేణులను మానసికంగా కుంగదీస్తుంది. అభ్యర్థి గెలిస్తే వచ్చే సాధారణ ఎమ్మెల్సీ  దా కంటే.. ఓడిపోతే పార్టీ రాష్ట్ర స్థాయి ప్రతిష్టకే జరిగే శాశ్వత నష్టం ఎన్నో రెట్లు తీవ్రంగా ఉంటుంది. బీఆరఎస్ పార్టీ బలహీన అభ్యర్థిని నిలబెట్టినా రిస్కే అవుతుందని అనుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.