(మెట్రో న్యూస్)
అచ్చంపేట పట్టణంలోని రెడ్డి భవన్ లో దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గామాత అమ్మవారిని టిపిసిసి ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సతీమణి డాక్టర్ అనురాధ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూదేవి శరన్న నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా అత్యంత పవిత్రమైన ఉత్సవాలుగా భక్తిశ్రద్ధలతో నవమి తొమ్మిది రోజులపాటు శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత భక్తిశ్రద్ధలతో ఆదరిస్తారని లోక కంటకుడైన మహిషాసురుడనే రాక్షసుడిని స్మరించి, ధర్మాన్ని ప్రతిష్టించడానికి అమ్మవారు అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పండుగ జరుపుకుంటారని, ఈ నవరాత్రులలో దుర్గాదేవిని ముఖ్యంగా నవ దుర్గాల రూపంలో లేదా వివిధ అలంకారాలతో పూజించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.ఈ నవరాత్రుల ఉత్సవాలు ప్రజలు అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని దుర్గామాత అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు,ప్రజలు, భక్తులు,తదితరులు,పాల్గొన్నారు.