తెలుగు రా(ష్టాల్లో శరన్నవరాత్రి వేడుకలు అంబరాన్నంటు తున్నాయి. ఈ నేపథ్యంలో నవరాత్రులలో నాలుగో రోజు అక్టోబర్ 14, బుధవారం రోజు ప్రముఖ శక్తి పీఠమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక దేవి కూష్మాండ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా కూష్మాండ దేవి అవతార విశిష్టత తెలుసుకుందాం.
అజేయం దుర్గాదేవి అవతారం
దేవి భాగవతం ప్రకారం ఁదుర్గఁ అనే పదానికి ఁజయింప సాధ్యం కాని శక్తిఁ అని అర్థం. దుర్గమం అంటే దుర్లభం అని కూడా అర్థముంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ సర్వ శక్తులను కేంద్రీకరించి దుర్గాదేవిని సృష్టించారని దేవి భాగవతంలో వివరించి ఉంది. ఈ నవరాత్రుల్లోనే అమ్మవారు రాక్షస సంహారం చేసింది కాబట్టి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ అమ్మవారిని శరన్నవరాత్రుల వేడుకల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులు విశేషంగా పూజిస్తారు. నవరాత్రులలో నాలుగో రోజు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక దేవి కూష్మాండ దేవిగా దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా కూష్మాండ దేవి ఎవరు? అమ్మవారికి ఆ పేరేలా వచ్చింది? ఆ తల్లి ఈ లోకాన్ని ఎలా కాపాడుతుంది? ఈ అమ్మవారికి ఏ రంగులంటే ఇష్టం? అసుర సంహారం కోసం అమ్మవారు ఎలాంటి ఆయుధాలను ధరించారు? అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఏ శ్లోకాన్ని పఠించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కూష్మాండ దేవి విశిష్టత
తన మందహాసంతో విశ్వాన్ని సృష్టించిన ఆదిశక్తి స్వరూపమే ఈ కూష్మాండ స్వరూపం! గుమ్మడి రూపంలో భూమండలావ్ని కల్పించిన తల్లి ఈ జగదాం! ఈ తల్లి తన అమృత హస్తాలలో చక్రం, గద, ధనుస్సు, బాణం మొదలగు ఆయుధాలను, కమండలం, అమృత కలశం, జపమాల, పద్మాలను ధరించి ఉంటుంది. ఈ కుష్మాండ దేవి తనను ఆరాధించిన భక్తులకు ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
కూష్మాండ పేరు వెనుక అర్థం
కూఁ అంటే చిన్నది లేదా కొంచెం, ఊష్మ అంటే ఉష్ణం లేదా శక్తి, అండం అని అర్థం. అంటే బ్రహ్మాండంగా వ్యవహరించే ఈ సమస్త విశ్వాన్ని జగన్మాత తన మందహాసంతో సృష్టించినది కనుక ఆమెకు కూష్మాండ దేవి అని పేరు.
కూష్మాండ దేవి వాహనం
కూష్మాండ దేవి అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారు సాధారణంగా సింహం లేదా పులి వాహనంపై ఎనిమిది చేతులతో దర్శనమిస్తారు. అందుకే ఈ తల్లిని అష్టభుజ దేవి అని అంటారు. ఈ తల్లి తన అమృత హస్తాలలో కమలం, అమృత కలశం, జపమాల, ధనుస్సు, బాణం వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది.
సృష్టికర్త
కూష్మాండ దేవి సమస్త జీవరాశులకు, ప్రకృతికి ప్రథమ మÖలం, విశ్వ సృష్టికర్త అని పురాణాలు చెబుతున్నాయి. సూర్య మండలంలో నివసించగలిగే శక్తి, తేజస్సు కేవలం ఈ కూష్మాండ దేవికే ఉందని దేవి భాగవతంలో వివరించి ఉంది.
ఏ పూలు? ఏ రంగు వస్తం?
కూష్మాండ దేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారిని ఈ రోజు ఎర్రని పూలతో పూజించాలి. ఎర్రని వస్తన్ని సమర్పించాలి.
ఏ శ్లోకం పఠించాలి?
యా దేవీ సర్వభూతేషు మా కూష్మాండ రూపేణ సంస్థితా
నమస్తస్యూ నమస్తస్యై నమస్తస్యై నమః
ఏ నైవేద్యం?
సంస్క ృతంలో గుమ్మడికాయను ఁకూష్మాండంఁ అంటారు. అందుకే కూష్మాండ దేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారికి ఈ రోజు గుమ్మడి కాయతో తయారు చేసిన హల్వా వంటి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.
కూష్మాండ దేవి పూజా ఫలం
దేవి నవరాత్రులలో నాలుగో రోజు కూష్మాండ దేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన భక్తుల రోగాలు, భయాలు తొలగుతాయని, భుక్తి, ముక్తి లభిస్తాయని, ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త వచనం. మనం కూడా ఈ దేవి నవరాత్రులలో శ్రీ శ్రీశైల భ్రమరాంబికను కూష్మాండ దేవిగా పూజించి భుక్తి, ముక్తి, ఆయురారోగ్యాలను పొందుదాం.
ఓం శ్రీ మాత్రే నమః