మెట్రో న్యూస్:
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జే. రవీందర్ కుటుంబాన్ని చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. మంగళవారం మందమర్రిలోని రవీందర్ నివాసానికి వెళ్లిన మంత్రి.. కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా రవీందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రవీందర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.