(మెట్రో న్యూస్):
దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నిజాంపేట్ పరిధిలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ప్రార్థించారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆలయ ధర్మకర్త కొలన్ తేజ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కొలన్ నర్సింహా రెడ్డి, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డీసీసీ సభ్యుడు రావూరి మౌళేశ్వర్ రావు, డివిజన్ అధ్యక్షులు వారాగాని వాసు, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, నాయకులు టేకుల ప్రవీణ్ రెడ్డి, శ్రీశైలం, లక్ష్మణ్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.