Take a fresh look at your lifestyle.

పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఏడు గ్రామాలు.. నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలి: ఏసీపీ శ్రీనివాస్ కుమార్

0 16

(మెట్రో న్యూస్)

పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఏడు గ్రామాలను చేర్చిన నేపథ్యంలో ప్రజలకు పోలీస్ శాఖపై అవగాహన కల్పించేందుకు రామచంద్రపురం ఏసీపీ సీహెచ్.వై. శ్రీనివాస్ కుమార్ రామచంద్రపురం మండల్ వెలిమెల గ్రామంలో ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై పలు సూచనలు చేశారు.గతంలో బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెలిమెల, వెలిమెల తండా,సందుగూడెం, ఘనాపూర్, వెంకుంట, కార్డానూర్, పాటి గ్రామాలను ప్రస్తుతం పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేర్చిన నేపథ్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
అలాగే ఇళ్లలో, సంస్థల్లో పనివారిని నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలను తెలుసుకోవాలని, గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ శాఖకు ప్రజల సహకారం అందితే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రవీందర్,ఎస్‌ఐలు రాజు, ఆసిఫ్ అలీ,గ్రామ మాజీ ఇన్‌చార్జి సర్పంచ్ నరేందర్ రెడ్డి, శాపురం నర్సింహారెడ్డి, మహేందర్‌, తెలంగాణ మత్స్యకార ఈసీ మెంబర్ సింగిర్తి బాలకృష్ణ తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.