Take a fresh look at your lifestyle.

నల్లమల మహా బతుకమ్మ–2026 నిర్వహణపై సమీక్ష సమావేశం.

0 25

(మెట్రో న్యూస్):

అచ్చంపేటలో ఘనంగా నల్లమల మహా బతుకమ్మ–2026 వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు.ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.

అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ ప్రజా భవన్ ఏమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ నెల 18వ తేదీ అనగా (ఆదివారం) నాడు అచ్చంపేట పట్టణంలోని పార్కు వద్ద నిర్వహించనున్న నల్లమల మహా బతుకమ్మ–2026 కార్యక్రమానికి సంబంధించి మెప్మా, ఆర్ పి ఎస్ ప్రతినిధులు, మరియు మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించిన అనంతరం బతుకమ్మ వేడుకల నిర్వహణ, మహిళల భాగస్వామ్యం, కార్యక్రమ ఏర్పాట్లు తదితర అంశాలపై టీపీసీసీ ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చర్చించారు .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరి భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మన సంస్కృతి మన గౌరవం… బతుకమ్మ మన తెలంగాణ ఆత్మగౌరవమని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని మహిళలందరికీ, ఆడపడుచులందరికీ నల్లమల మహా బతుకమ్మ–2026 వేడుకలకు హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతూ.. మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ, పూల పండుగ బతుకమ్మను అందరం కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకుందాం. మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.