ఇంటర్నెట్ డెస్క్:
- ఈడీ కేసులనూ విచారించనున్న సీబీఐ కోర్టు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై నమోదైన కేసుల విషయంలో రోజూవారి విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సీబీఐ కేసులనే విచారిస్తున్న కోర్టు… ఇక మీదట ఈడీ కేసులను కూడా కలిపి విచారణ జరపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి జగన్ సహా మరికొందరిని వ్యక్తిగతంగా సీబీఐ కోర్టు విచారించనుంది. వచ్చే వారం నుంచి ఈ కేసులను సీబీఐ కోర్టు విచారించే అవకాశాలున్నాయి. వైఎస్ జగన్‌పై న్యాయస్థానంలో పదేళ్లుగా 9 ఈడీ ఛార్జిషీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకు సాగడంలేదని ఈడీతో పాటు మరి కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం.