(మెట్రో న్యూస్):
అచ్చంపేట పట్టణంలోని మార్కెట్ యార్డులో అచ్చంపేట మండలానికి చెందిన రైతు లబ్ధిదారులకు స్ప్రింక్లర్ సెట్లను
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు & అచ్చంపేట
ఏమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూరైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – సాగులో ఆధునిక పద్ధతులకు ప్రోత్సాహం అందిస్తుంది అన్నారు.
రైతులకు సాగునీటి వినియోగంలో పొదుపు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం,వ్యవసాయాన్ని మరింత సులభతరం చేయడం వంటి లక్ష్యాలతో రైతులకు అవసరమైన పరికరాలను అందించడంలో ఈ కార్యక్రమం భాగంగా నిలిచిందనీ. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. వ్యవసాయ అభివృద్ధే మా ధ్యేయమని తెలిపారు.