Take a fresh look at your lifestyle.

ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించే శక్తి లభించాలి

0 13

(మెట్రో న్యూస్) :

* రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
* జోగులాంబ దేవికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించే శక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి కలగాలని జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు కోరినట్లు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.ఎల్‌నినో ప్రభావం నుంచి రైతాంగం,ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు తొలగి,సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జోగులాంబ అమ్మవారిని ప్రార్థించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక,క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.శుక్రవారం దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటంబసమేతంగా శ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించడంతో పాటు విఘ్నేశ్వర స్వామికి అభిషేకం చేశారు.అనంతరం శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి,పట్టు వస్త్రాలు సమర్పించారు.అర్చకులు అమ్మవారి ప్రసాదం,శేషవస్త్రాన్ని అందజేసి ఆశీర్వచనాలు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ..శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివార్ల దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తనకు ఎంతో పుణ్యప్రదమైన అవకాశమని పేర్కొన్నారు.పేదలు,బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మవారు మరింత శక్తి,సామర్థ్యాలను ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు.ఎల్‌నినో ప్రభావాలు తగ్గి,రాష్ట్రంలో అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొని,సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీ జోగులాంబ అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.రైతాంగం మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, వ్యవసాయ రంగం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రకృతి ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందాలని అమ్మవారి ఆశీస్సులు కోరినట్లు పేర్కొన్నారు.రాష్ట్రం సస్యశ్యామలంగా మారి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సరిత,ఆలయ ఈవో దీప్తి,స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.