సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు దైవ దర్శనం తరువాత తీర్ధ ప్రసాదాలు స్వీకరించడం మామÖలే! ఆలయాల్లో పంచిపెట్టే ప్రసాదాలు భగవం తుని దివ్య అనుగ్రహాన్ని సంతరించుకుని మరింత రుచికరంగా మారుతాయి. అయితే ఆలయాల్లో పులి ర, దధ్యోదనం, చక్ర పొంగలి వంటి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంచి పెట్టడం ఆనవాయితీ. కానీ ఒక చోట మాత్రం ప్రసా దంగా నాణేలు పంచి పెడ తారం! ఇంతకూ ఆ ఆలయం ఎక్కడుంది? ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
నాణేలు ప్రసాదం
గుడి అనగానే అక్కడే కొలువైన దైవం మాత్రమే కాదు ఆ ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలు కూడా గుర్తుకు రావడం సహజం. తిరుపతి బాలాజీ ఆలయం గురించి చెప్పగానే లడ్డు ప్రసాదం తప్పకుండా అందరికీ గుర్తుకు వస్తుంది. ఇలా ప్రసాదాల వల్లనే ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. రాజస్థాన్
లోని బానోడా బాలాజీ ఆలయం కూడా ప్రసాదాల వల్లే ఖ్యాతి చెందింది. అయితే ఇక్కడ ప్రసాదంగా పులి ర, లడ్డూలు కాకుండా నాణేలు పంపిణీ చేయడం విశేషం. నాణేల ప్రసాదం వల్లనే ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ విశేషాలు చూద్దాం.
బానోడా బాలాజీ ఆలయం
బానోడా బాలాజీ ఆలయం రాజస్థాన్
లో వెలసి ఉంది. నాణేలు ప్రసాదంగా పంచడం అనే ప్రత్యేక సంప్రదాయంతో, బానోడా బాలాజీ ఆలయం మహిమాన్విత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామి దర్శనానికి వస్తారు. నిత్యం భక్తులతో కిటకిటలాడుతుండే ఈ ఆలయం పండుగలు, ఉత్సవాల వేళ మరింత రద్దీగా ఉంటుంది.విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రం:బానోడా బాలాజీ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది 13 పవిత్ర ఆలయాల సమాహారంగా వెలసిన ఒక విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ఆలయంలో వెలసి ఉన్న పంచముఖి హనుమాన్, జగన్నాథుడు, ఖటుశ్యామ్ బాబా, శ్రీ శేషావతార్ కల్లాజీ వంటి మహిమాన్విత దేవి దేవతలు భక్తుల కోరికలు తీర్చే దైవ శక్తులుగా పూజలందుకోవడం విశేషం.నిరంతర రామాయణ పారాయణబానోడా బాలాజీ ఆలయానికి చెందిన పండిట్ కైలాశ్ శర్మ ఆధ్వర్యంలో నిరంతరంగా జరిగే రామాయణ పారాయణం ఈ పుణ్యక్షేత్రానికి అసలైన ఆధ్యాత్మిక వైభవాన్ని చేకూర్చుతోంది. గత రెండు దశాబ్దాలుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని 200కు పైగా గ్రామాల్లో ఈ పవిత్ర పారాయణం భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తోంది. అలాగే ఇక్కడ వెలసి ఉన్న సిద్ధిదాత్రి దేవి ఆలయంలో జరిగే 16 రోజుల విశిష్ట నవరాత్రి మ త్సవాలు వేలాది భక్తులను ఆకర్షించే ప్రధాన ఆధ్యాత్మిక వేడుకలుగా పేరొందాయి. ఈ ఉత్సవాలు ఆలయ వైభవాన్ని చాటుతున్నాయి.నాణేల ప్రసాదం:బానోడా బాలాజీ ఆలయంలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నాణేలను తిరిగి ప్రసాదంగా భక్తులకే పంచి పెట్టే సంప్రదాయంగా అనాదిగా కొనసాగుతోంది. ఈ ఆలయంలో ప్రసాదంగా పంచి పెట్టే నాణేలు తమ వద్ద ఉంచుకుంటే సిరి సంపదలు పెరుగుతాయని, సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు ఈ నాణేలు లక్ష్మీ ప్రసాదంగా భద్రంగా దాచుకుంటారు. కొందరు భక్తులైతే ప్రసాదంగా లభించిన ఈ నాణేలు మొదటి పెట్టుబడిగా పెట్టి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.
అలాగే భక్తులు మొక్కుల రూపంలో నాణేలనే ఆలయ హుండీలో వేయడం ఆచారం.
డబ్బు ప్రసాదంతో పాటు, లడ్డు, పులి ర వంటి ఇతర ప్రసాదాలను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. ఈ ఆలయానికి ఉన్న మహత్యం వలన నానాటికీ భక్తుల రద్దీ పెరుగుతుండటంతో, అధికారులు ఆలయ విస్తరణ పనులు చేపట్టారు. ఉత్సవాల సమయంలో నిర్ణీత దర్శన వేళలు పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మనం కూడా బానోడా బాలాజీ ఆలయాన్ని దర్శించి నాణేల ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుందాం. లక్ష్మీ కటాన్ని పొందుదాం.
శుభం భూయాత్!