Take a fresh look at your lifestyle.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. తెలంగాణలో 28 వరకు వానలు!

0 12
Telangana Weather Update Rains Forecasted Till August 28
  • బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం
  • తెలంగాణాలోని 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
  • ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
  • కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా తెలంగాణలో నేటి (ఆగస్టు 21) నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ప్రధానంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, పోలవరం ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగిలిన కోస్తా జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడతాయని వివరించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.