Take a fresh look at your lifestyle.

ఘనంగా అమ్రాబాద్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ జన్మదిన వేడుకలు.

0 3

(మెట్రో న్యూస్):

నాగర్ కర్నూలు జిల్లా లోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా శనివారం బాణాసంచాతో కాంగ్రెస్ నాయకులు ఆనందోత్సవాలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కి ఒకరికొకరు జన్మ దిన శుభాకాంక్షలు తెలుపుకొని ఎమ్మెల్యే నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించి రాజకీయాలలో అత్యున్నత పదవులు అనుభవించి ప్రజలకు సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకున్నారు.

అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, పండ్లు మరియు బ్రెడ్లు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఎన్ ఎస్ యు ఐ నాయకులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.