ప్రతి శివాలయంలో మÖలవిరాట్టును దర్శించిన తర్వాత నవగ్రహాలను కూడా సందర్శించడం సర్వసాధారణం. అయితే ఆలయ ప్రాంగణంలోని నవగ్రహాలను ఎందుకు పూజించాలి? నవగ్రహాల ఆరాధన వెనుక అంతరార్థం? ఏమిటో తెలుసుకుందాం. మన ఇష్టదైవాన్ని కళ్లారా దర్శించుకుని, మనసారా పూజించుకుని, మన మనసులోని కోరికలు స్వామికి విన్నవించుకోవడానికే మనం ఆలయాలకు వెళ్తుంటాం. సాధారణంగా ప్రతి శివాలయంలో నవగ్రహాల మండపం కనిపిస్తుంది. మÖలవిరాట్టును దర్శించిన తర్వాత నవగ్రహాలను కూడా పూజించడం సర్వ సాధారణం. అయితే ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలను ఎందుకు పూజించాలి? నవగ్రహాల ఆరాధన వెనుక అంతరార్థం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నవగ్రహం అంటే?
గ్రహం అంటే గ్రహించేది అని అర్ధం. సూర్యుడు ఒక నక్షత్రం! చంద్రుడు ఓ ఉపగ్రహం, రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఇది అందరికీ తెలిసిందే! అయినప్పటికీ వీటితోపాటు మరో ఐదు గ్రహాలను కలిపి నవగ్రహాలుగా చేయడం వెనుక ఓ పరమార్ధం ఉంది.
తొమ్మిది పూర్ణసంఖ్య!
జ్యోతిష శాస్తం, సంఖ్యా శాస్తన్ని అనుసరించి తొమ్మిది పూర్ణసంఖ్యగా పేర్కొంటారు. సంఖ్యల్లో తొమ్మిది చివరి సంఖ్య. తొమ్మిది తరువాత ఒకటి పక్కన సున్నా చేరిస్తేనే పది అవుతుంది అంతేకాని కొత్తగా మరో సంఖ్య ఏమీ రాదు. అలాగే తొమ్మిదిని ఏ సంఖ్యతో గుణించిన తొమ్మిదే వస్తుంది. ఇది సంఖ్యాశాస్తంలో ఓ అద్భుతం. మానవ శరీరంలో ప్రధానంగా ఉండేవి నవరంధ్రాలు. వీటి ద్వారానే జీవన క్రియ మొత్తం సాగుతుంది. అందుకే తొమ్మిది సంఖ్యను పరిపూర్ణమైన సంఖ్య అంటారు.
నవగ్రహ ఆరాధన తప్పనిసరిఇక నవగ్రహాల విషయానికి వస్తే, నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. ఈ నవగ్రహాలు మన జీవితంపై అసాధారణమైన ప్రభావాన్ని చూపుతాయి.ఈ ప్రభావం కారణంగానే శుభ అశుభ ఫలితాలు ఏర్పడుతాయని జ్యోతిష శాస్త పండితులు చెబుతారు.మన నిత్యజీవితంలో అశుభ ఫలితాలు తొలగి, శుభ ఫలితాలు పొందాలంటే నవగ్రహాలను తప్పకుండా ఆరాధించాలని శాస్తలు చెబుతున్నాయి.
సూర్యుడు
సూర్యుడు గ్రహాధిపతి. నవగ్రహాలకు రాజు వంటివాడు. ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన వారం. అసలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా సూర్యుని ఆరాధిస్తే, ఆ సూర్య భగవానుడు మానవాళికి శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.
చంద్రుడు
జ్యోతిష శాస్తం ప్రకారం చంద్రుని మనఃకారకుడని అంటారు. అంటే చంద్రుడు మనో విచారాన్ని తొలగించి మానసిక సంతోషాన్ని కలుగజేస్తాడని అంటారు. సోమవారానికి అధిపతి చంద్రుడు. ప్రతిరోజూ చంద్రుని ఆరాధిస్తే మానసిక ఉద్వేగాలను నియంత్రించి, మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు. బంధాలను దృఢంగా మారుస్తాడు.
కుజుడు
కుజుడు మంగళ కారకుడు. మంగళవారానికి అధిపతి కుజుడు. వివాహయోగం కలగాలన్నా, సంతానప్రాప్తి కలగాలన్నా కుజ గ్రహ అనుకూలత ముఖ్యం. ప్రతిరోజూ కుజుని ఆరాధించే వారికి కుజుడు మనోధైర్యాన్ని, సమస్యలను అధిగమించే శక్తిని ప్రసాదిస్తాడు.
బుధుడు
బుధుడు బుద్ధికారకుడు. బుధునికి ప్రీతికరమైన వారం బుధవారం. ప్రతిరోజూ బుధుని ఆరాధిస్తే మంచి విద్య, జ్ఞానం, విజ్ఞానం లభిస్తాయని, ఆలోచనలో పరిణితి ఏర్పడుతుందని విశ్వాసం.
గురుడు
బృహస్పతిగా పిలుచుకునే గురు గ్రహం అత్యంత శుభ గ్రహం. గురువారానికి అధిపతి గురుడు. ఒక్క గురుగ్రహం అనుకూలత ఉంటే చాలు తక్కిన గ్రహాల అనుకూలత లేకపోయినా విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజూ గురుని ఆరాధించడం వల్ల జీవితంలో అభివృద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చెందుతాయి.
శుక్రుడు
నవగ్రహాల్లో శుక్రుడు శుభ గ్రహం. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. ప్రతి రోజు శుక్రుని ఆరాధిస్తే ప్రేమ, విలాసాలు, భోగభాగ్యాలు, అందం, ఆనందం ఇలా జీవితానికి కావాల్సినవన్నీ అందిస్తాడు.
శని భగవానుడు
శని పేరు చెబితేనే చాలు భయపడి పోవడం సహజం. నిజానికి శని న్యాయదేవ! మనం చేసిన పాపపుణ్యాలను తగిన ఫలితాలను అందించేవాడు శని భగవానుడు. శనివారానికి అధిపతి శనిదేవుడు. ప్రతిరోజూ శనిభగవానుని ఆరాధించడం వల్ల క్రమశిక్షణ, చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం, దీర్ఘకాలంలో అభివృద్ధిని సాధించవచ్చు.
రాహువు
జ్యోతిష శాస్తం ప్రకారం రాహువు ఛాయాగ్రహం. మనకు ఏదైనా గందరగోళ పరిస్థితి ఎదురైనప్పుడు రాహువును పూజిస్తే గందరగోళాన్ని తొలగించి, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే శక్తిని ప్రసాదిస్తాడు.
కేతువు
జ్యోతిష శాస్తం ప్రకారం కేతువు కూడా ఛాయాగ్రహమే! కేతువు గతజన్మల పాపఫలాన్ని తగ్గిస్తాడని విశ్వాసం. అందుకే కేతువును ఆరాధించడం వల్ల జీవితంలో పాపఫలంగా ఎదురయ్యే సమస్యలు తొలగి సానుకూలత పెరుగుతుంది.
నవగ్రహ ఆరాధన ఫలం
ఆలయానికి వెళ్లినప్పుడు ముందుగా నవగ్రహ మండపానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ఎంతో ముఖ్యం. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటూ 9 కానీ 11 కానీ ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాలను ఎప్పుడూ తాకరాదు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం పూర్తయ్యాక కాళ్లు కడుక్కోవాలి అంటారు కానీ అది కేవలం అపోహ మాత్రమే! నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం పూర్తయ్యాక ఆలయంలోని మÖలవిరాట్టును దర్శించుకోవడం ప్రధానం. జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించడానికి కావాల్సిన శక్తిని, ధైర్యాన్ని పొందడానికి, శారీరక మానసిక ఆరోగ్యాలు పొందడానికి నవగ్రహాల ఆరాధన తప్పనిసరిగా చేయాలని పండితులు చెబుతారు. మనం కూడా నవగ్రహాలను ఆరాధించి సుఖశాంతులను పొందుదాం.
శుభం భూయాత్!