Take a fresh look at your lifestyle.

కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని…

0 3

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

సాగునీటికోసం యువ‌త‌ సైకిల్ యాత్ర..

కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రపూరిత నిర్లక్ష్యంతో సుక్కనీరులేక నోర్లు తెరుస్తున్న పరిస్థితిని, రైతుల ఆవేదనను తెలుసుకుంటూ.. తెలంగాణ వ్యవసాయం తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను ప్రకటిస్తూ.. గోదావరిఖనికి చెందిన కొంద‌రు యువ‌కులు సైకిల్ యాత్ర చేపట్టారు. గోదావరిఖనికి చెందిన మాజీ కార్పొరేటర్ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో 10 మంది యువకులు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా 8 రోజుల పాటు సుమారు 400 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర ద్వారా చేరుకున్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో కలిసి తమ యాత్రావివరాలను తెలియ‌జేశారు. తమ సైకిల్ యాత్ర సందర్భంగా.. సాగునీరు లేక కరెంటు రాక బోర్లు ఎండిపోయి పంటలు ఆగమై ఆవేదన చెందుతున్న రైతుల దు:ఖాన్ని బీఆర్ఎస్ అధినేత‌కు వివరించారు. ఈ సందర్భంగా వారు తెచ్చిన గోదావరి జలాలను కేసీఆర్‌కు అందించారు. సైకిల్ యాత్ర నిర్వహించిన బొడ్డు రవీందర్ బృందానికి కేసీఆర్‌ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.