Take a fresh look at your lifestyle.

7 టీఎంసీల నీటి విడుద‌ల‌కు క‌ర్ణాట‌క సీఎం డీకే అంగీకారం

0 22

బెంగుళూరు (మెట్రో న్యూస్‌):

  • 30 రోజుల పాటు 5 వేల క్యూసెక్కుల విడుద‌ల‌.

తెలంగాణ‌కు నీటిని విడుద‌ల చేయడానికి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం అంగీక‌రించింది. జూరాల ఆయ‌క‌ట్టు రైతుల ఆందోళ‌న నేప‌థ్యంలో బెంగుళూరు వెళ్లి ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌ను క‌లిసి… నీటిని విడుద‌ల చేయాల‌న్న రాష్ట్ర మంత్రుల కృషి ఫ‌లించింది. నారాయ‌ణ‌పూర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణ‌కు 7 టీఎంసీల నీటిని విడుద‌ల చేయ‌డానికి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి అంగీక‌రించారు. రోజూ 5 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల పాటు నీటిని విడుద‌ల చేస్తారు.

మంగ‌ళ‌వారం రాత్రి సీఎం డీకేతో స‌మావేశ‌మై విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన ఉమ్మ‌డి మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా ప్ర‌తినిధుల బృందం బుధ‌వారం ఉద‌యం రెండోసారి భేటీ అయ్యింది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వ‌యంగా డీకేతో ఫోనులో మాట్లాడి… స‌మ‌స్య‌ను వివ‌రించారు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్య‌ర్థ‌న‌కు డీకే సానుకూలంగా స్పందించారు. మ‌రోవైపు మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి ఆదేశాల మేర‌కు జూరాల ప్రాజెక్టు నుండి కుడి, ఎడ‌మ కాలువ‌ల‌కు అధికారులు సాగునీటిని విడుద‌ల చేశారు.

Leave A Reply

Your email address will not be published.