Take a fresh look at your lifestyle.

కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష

0 21

(మెట్రో న్యూస్):

కరీంనగర్ కలెక్టరెట్ ను ఈ నెల 30న ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రారంభోత్సవ,కార్యక్రమానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
నూతన కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ ఛాంబర్‌తో పాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
ప్రారంభోత్సవం అనంతరం నూతన కలెక్టరేట్‌లో అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, తదితర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.