Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో భారీ పేలుడు శబ్దాలు.. భూకంపం వచ్చిందా? బ్లాస్టింగ్ జరిగిందా?

0 3

హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దాలు కలకలం రేపాయి. బ్లాస్టింగ్ జరిగినట్లు వినిపించిన ఈ శబ్దాలతో పలు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉప్పరపల్లి, ఎర్రగడ్డ, లంగర్‌హౌస్‌, కేశవస్వామి నగర్‌తో పాటు రాజేంద్రనగర్‌ పరిసరాల్లో ఈ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్లు అనిపించిందని పేర్కొన్నారు. దీంతో అసలు ఏం జరిగిందనే దానిపై చర్చ మొదలైంది.

ఒకేసారి పలు ప్రాంతాల్లో భారీ శబ్దాలు

మంగళవారం ఉదయం సుమారు 9.15 గంటల సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పేలుడు సంభవించిందా? భూకంపం వచ్చిందా? అనే సందేహాలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. రాజేంద్రనగర్‌ ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు అనిపించిందని కొందరు స్థానికులు వెల్లడించారు. అయితే ఈ శబ్దాలకు సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ఒకేసారి పలు ప్రాంతాల్లో శబ్దాలు వినిపించడం, భూమి కంపించినట్లు స్థానికులు చెప్పడంతో భూకంపం వచ్చిందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఘటన భూకంపం వల్లే జరిగిందని నిర్ధారించే అధికారిక సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. అలాగే భూగర్భ ప్రక్రియలు లేదా ఇతర కారణాల వల్లే ఈ శబ్దాలు వచ్చాయని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. కాగా భారీ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుక కారణమేంటి? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.