భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయం ఎంత ప్రాచీనమో, అంతే వైవిధ్యభరితమైనది. దేవతను ఒకే రూపంలో కాకుండా ప్రకృతిలోని అనేక శక్తుల ప్రతిరూపంగా దర్శించిన తత్తం మన సంస్క ృతిలో కనిపిస్తుంది. ఆ భావనకు అత్యంత అరుదైన ప్రతిరూపంగా నిలిచిన క్షేత్రమే ఒడిశాలోని హిరాపూర్ చౌసఠ్ యోగిని ఆలయం. భువనేశ్వర్‌కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం సాధారణ దేవాలయాలకు పూర్తిగా భిన్నమైన నిర్మాణం, శక్తి ఆరాధనలో విశిష్టమైన సంప్రదాయం, అద్భుతమైన శిల్పకళతో భక్తులను ఆకర్షిస్తుంది. ఎనిమిదో నుంచి పదమÖడో శతాబ్దం మధ్య భారతదేశంలో వికసించిన యోగిని సంప్రదాయానికి మిగిలిన అరుదైన ఆలయాల్లో ఇది ఒకటి.ఈ ఆలయం తొమ్మిదో శతాబ్దంలో భౌమకర వంశానికి చెందిన రాణి హీరాదేవి, రాజు శుభకరదేవుడు రెండవవారి తల్లి, నిర్మించినదిగా ఒడిశా టూరిజం అధికారిక సమాచారం పేర్కొంటోంది. కొందరు చారిత్రక ఆధారాలు దీని నిర్మాణాన్ని సుమారు క్రీస్తుశకం 864 ప్రాంతానికి అనుసంధానిస్తాయి.
హీరాదేవి పేరుతోనే ఈ ప్రాంతానికి హిరాపూర్ అనే పేరు వచ్చిందనే అభిప్రాయం కూడా ఉంది. అయితే నిర్మాణానికి సంబంధించిన ఖచ్చితమైన కాలనిర్ణయంపై చారిత్రక అధ్యయనాల్లో కొంత భేదాభిప్రాయం ఉన్నప్పటికీ, తొమ్మిదో శతాబ్దపు భౌమకర కాలానికి చెందిన క్షేత్రమనే విషయంలో విస్తృతమైన ఏకాభిప్రాయం ఉంది.నినిఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే కనిపించే మొదటి విశేషం దాని వృత్తాకార నిర్మాణం, పైకప్పు లేకపోవడం. సాధారణ దేవాలయాల్లో గర్భగృహం, విమానం, శిఖరం, మండపం వంటి నిర్మాణాలు ఉంటాయి. కానీ హిరాపూర్ యోగిని ఆలయానికి ఆకాశమే పైకప్పు. ప్రకృతిలోని పంచభూతాలను భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాన్ని ఆరాధించే యోగిని సంప్రదాయానికి ఈ నిర్మాణం ప్రతీకాత్మకంగా అనుసంధానించబడిందని భావిస్తారు.
భక్తుడు దేవిని దర్శించేటప్పుడు తన చుట్టూ ఉన్న ప్రకృతినీ దైవస్వరూపంగానే అనుభవించేలా ఈ నిర్మాణం ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది.నినివృత్తాకార గోడల లోపల యోగినుల కోసం ప్రత్యేకమైన గూళ్లు ఉన్నాయి. 64 యోగినులు శక్తి యొక్క వివిధ రూపాలకు ప్రతీకలు. యోగిని సంప్రదాయం యోగం, తంత్రసాధన, శక్తి ఆరాధనలతో ముడిపడి ఉంది. హిరాపూర్‌లోని యోగినులను నల్లటి క్లోరైట్ రాతితో అత్యంత సున్నితమైన శిల్పకళతో తీర్చిదిద్దారు. ఒక్కో యోగిని ప్రత్యేకమైన భంగిమ, అలంకరణ, కేశవిన్యాసం, వాహనంతో దర్శనమిస్తుంది. కొన్ని యోగినులకు జంతు ముఖాలు కూడా కనిపిస్తాయి. శిల్పాల్లోని వైవిధ్యం చూస్తే, తొమ్మిదో శతాబ్దపు శిల్పులు కేవలం దైవభావనను మాత్రమే కాకుండా లక్ష్క్ష్మిశక్తిలోని అనేక పార్శ్వాలను కూడా రాతిలో బంధించారనిపిస్తుంది.నినిఈ 64 సంఖ్యకు కూడా ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. యోగిని ఆరాధనలో చక్రం లేదా చక్రంలోని 64 అంచులు అనే భావనతో ఈ సంఖ్యను అనుసంధానిస్తారు.
యోగినులను సప్తమాతృకల నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలుగా కూడా సంప్రదాయం భావిస్తుంది. అందువల్ల ఇక్కడ 64 దేవతలు వేర్వేరు దేవతలుగా కాకుండా ఒకే ఆదిశక్తి అనేక రూపాలుగా వ్యక్తమైనదనే తాత్విక భావన ప్రధానంగా కనిపిస్తుంది.నినిఆలయంలో ప్రధాన దైవంగా కాళికాదేవి కొలువై ఉన్నారు. దేవి మానవ శిరస్సుపై నిలబడి ఉన్న రూపం ఇక్కడి ముఖ్యమైన ప్రతీకల్లో ఒకటి. దీనిని మనస్సుపై హృదయ విజయం, అహంకారంపై శక్తి ఆధిపత్యం వంటి ఆధ్యాత్మిక భావాలతో అన్వయిస్తారు. మధ్యలోని చండీ మండపంలో మిగిలిన యోగినులలో కొన్ని, భైరవ స్వరూపాలకు సంబంధించిన ప్రతిమలు ఉన్నట్లు చారిత్రక వివరాలు చెబుతున్నాయి.
ఆలయ ప్రణాళికలో శక్తి-భైరవ తత్త్వాల పరస్పర సంబంధం కూడా కనిపిస్తుంది.మరో ఆసక్తికరమైన అంశం ఈ ఆలయంలో సాధారణంగా కనిపించే శృంగార శిల్పాలు లేకపోవడం. అదే కాలానికి చెందిన ఒడిశా, మధ్యభారతంలోని కొన్ని ఆలయాల్లో శృంగార శిల్పాలు విస్తారంగా కనిపిస్తాయి. అయితే హిరాపూర్ యోగిని ఆలయంలో అవి కనిపించవు. యోగిని సంప్రదాయంలోని సాధనా మార్గాలు, బ్రహ్మచర్య భావన దీనికి కారణమై ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.ఈ అపురూప ఆలయం ఆధునిక కాలంలోనే విస్తృతంగా వెలుగులోకి వచ్చింది. 1953లో ఒడిశా స్టేట్ మÖ్యజియం క్యూరేటర్ కేదార్‌నాథ్ మహాపాత్ర దీనిని గుర్తించి ప్రపంచ దృష్టికి తీసుకువచ్చారు. నేడు ఆలయం పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, దేశంలో మిగిలిన యోగిని ఆలయాల్లో అత్యంత సంరక్షితమైన వాటిలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రతి సంవత్సరం డిసెంబరు 23 నుంచి 25 వరకు జరిగే చౌసఠ్ యోగిని మ త్సవం ద్వారా శాక్క్ష్మయ సంగీతం, ఒడిస్సీ నృత్యం వంటి కళారూపాలకు కూడా ఈ క్షేత్రం వేదికగా నిలుస్తోంది.నినిహిరాపూర్ చౌసఠ్ యోగిని ఆలయం కేవలం పురాతన దేవాలయం కాదు; క్క్ష్మశక్తిని 64 రూపాల్లో దర్శించిన భారతీయ తాత్విక దృష్టికి సజీవ సాక్ష్యం. గోడల మధ్య దేవతలు, పైకప్పు స్థానంలో ఆకాశం, చుట్టూ ప్రకృతి, మధ్యలో కాళికాదేవి ఈ సమన్వయం భక్తుడికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. శక్తి ఒకే రూపంలో బంధించబడదని, సృష్టిలోని ప్రతి శక్తిలోనూ ఆమె ఉనికి ఉంటుందని ఈ క్షేత్రం తెలియజేస్తుంది. ఆకాశం వైపు తెరిచి ఉన్న ఈ చిన్న ఆలయం, మనిషి అంతరంగాన్ని అనంతమైన దైవశక్తి వైపు తెరవాలనే మహత్తర సందేశాన్ని నిశ్శబ్దంగా అందిస్తోంది.