Take a fresh look at your lifestyle.

చోరీకి గురైన 57 మొబైల్ ఫోన్ల రికవరీ

0 4

(మెట్రోన్యూస్ )

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో చోరీకి గురైన 57 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి రికవరీ చేసి, వాటిని అసలు యజమానులకు తిరిగి అందజేసినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఒ బి. శ్రీనివాస్ తెలిపారు. మొబైల్ ఫోన్ల చోరీకి సంబంధించి బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సిఈఐఆర్ (సెంట్రల్ ఏక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ) పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాటి ఆచూకీని గుర్తించి మొత్తం 57 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు.రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను సంబంధిత యజమానులకు పోలీస్ స్టేషన్‌లో తిరిగి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా తమ మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్ ఫోన్ చోరీకి గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, సిఈఐఆర్ పోర్టల్ (డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ .సెయిర్ .గవ .ఇన్ ) ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవాలని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను భద్రపరచుకోవాలని సూచించారు .ప్రజల ఆస్తుల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు టౌన్–I పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్హెచ్ఒ శ్రీనివాస్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.