మెట్రో న్యూస్ అచ్చంపేట (నవంబర్ 2):
మురసు తుఫాన్ ప్రభావంతో శ్రీశైలం ఘాట్ రోడ్డు ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల తో పాటు ఘాట్రోడ్లో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో 3,4,5, తేదీల్లో ఘాట్ రోడ్డు ప్రయాణాలు పూర్తిగా మానుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని కొండల్లో నుంచి రాళ్లు దొర్లి పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.