రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి రాకెట్ బాల్ పోటీలలో ఎనిమిదవ తరగతికి చెందిన N శ్రీ అక్షయ రెడ్డి,M సౌమ్య మరియు 9వ తరగతి చెందిన విద్యార్థి N యస్వంత్ జూనియర్ విభాగంలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పంజాబ్ రాష్ట్రంలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాలలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా విద్యాసంస్థల అదినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై విద్యార్థులను అభినందించారు ఈ మాట్లాడుతూ చదువుతోపాటు ఆటల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.