Take a fresh look at your lifestyle.

తెలంగాణ శాసనసభ తరఫున జాతీయ స్థాయి సదస్సులో ప్రాతినిధ్యం వహించనున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.

0 3

మెట్రో న్యూస్ అచ్చంపేట (నవంబర్ 3):

జాతీయస్థాయి పీఏసీ సదస్సులో తెలంగాణ శాసనసభ తరపున టిపిసిసి ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వహించనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత పార్లమెంట్‌తో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల పబ్లిక్ అకౌంట్స్ కమిటీల ( పిఎసి) చైర్మన్లు, సభ్యుల జాతీయ సదస్సు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరగనుందని ఆడిట్, జవాబుదారీతనం మరియు సుపరిపాలన – పీఏసీ మారుతున్న పాత్ర” (Audit, అకౌంటెబిలిటీ అండ్ గుడ్ గవర్నన్స్ – ది ఏవోలవింగ్ రోల్ అఫ్ ది పిఎసి) అనే ప్రధాన అంశంపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. ప్రజాధనం సక్రమంగా వినియోగం కావడం, ప్రభుత్వ ఖర్చుల్లో పారదర్శకతను పెంపొందించడం, ఆర్థిక నిర్వహణలో జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో శాసనసభల పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఈ జాతీయ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు.
ఈ సదస్సు ద్వారా ప్రజా పద్దుల కమిటీల బాధ్యతలు, విధులు, ఆర్థిక పర్యవేక్షణలో వాటి పాత్రపై వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకోనున్నారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.