Take a fresh look at your lifestyle.

Harish Rao Arrest | బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు అరెస్ట్ .. పోలీసు స్టేషన్‌ ఎదుట కార్యకర్తల ధర్నా

0 15

Harish Rao Arrest | బీఆర్ఎస్ ఎల్పీఉప నేత తన్నీరు హరీష్ రావును హనుమకొండ సుబేదారి లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Harish Rao Arrest | బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు అరెస్ట్ .. పోలీసు స్టేషన్‌ ఎదుట కార్యకర్తల ధర్నా

వరంగల్ (సుబేదారి) : బీఆర్ఎస్ ఎల్పీఉప నేత తన్నీరు హరీష్ రావు( Harish Rao Arrest) ను  మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌కుమార్‌తో పాటు పలువురిని హనుమకొండ ( Hanamkonda) సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులకు హరీష్ రావు మద్దతు తెలిపారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం సమీపం లోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళనకు వెళుతున్నారనే సమాచారంతో లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ పార్టీ పోలీసులు చేరుకున్నారు.

Harish Rao Arrest

ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపిన తర్వాత హరీష్ రావును అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త త వాతావరణం నెలకొంది. హరీష్ రావును సమీపంలోని సుబేదారి పోలీసు స్టేషన్ కు కాలినడకన తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు సుబేదారి పీఎస్ కు తరలివచ్చి స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశారు.

Leave A Reply

Your email address will not be published.