Take a fresh look at your lifestyle.

మాదారం ఆలయాల పునర్నిర్మాణానికి రూ.3 లక్షల విరాళం.. గ్రామ అభివృద్ధికి అండగా గుడి వంశీధర్ రెడ్డి

0 4

రఘునాథపల్లి మెట్రో న్యూస్ నవంబర్ 02:

 

రఘునాథపల్లి మండలంలోని మాదారం గ్రామంలో ఆలయాల పునర్నిర్మాణానికి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్ రెడ్డి రూ.3 లక్షల విరాళాన్ని అందజేశారు.

హైదరాబాద్‌లోని తన వ్యక్తిగత కార్యాలయంలో మాదారం గ్రామ సర్పంచ్ ఆరూరి సరిత మల్లేష్, ఉపసర్పంచ్ బాల్నే శ్రీనివాస్‌తో పాటు గ్రామ ప్రముఖులు గుడి వంశీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అనంతరం గ్రామంలోని శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ దుర్గమ్మ తల్లి, శ్రీ పోచమ్మ తల్లి ఆలయాల పునర్నిర్మాణ పనుల ఖర్చుల నిమిత్తం రూ.3,00,000 (మూడు లక్షల రూపాయలు) విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుడి రాంరెడ్డి, వార్డు సభ్యుడు ముప్పిడి సాంబ, బాల్నే గట్టు మల్లయ్య, రేస్ కుమార్, బాల్నే అశోక్, బాల్నే పరుశురాం, బోయిని శ్రీధర్ రెడ్డి, బాల్నే బిక్షపతి, బాల్నే సోమయ్య, ఉమ్మగొని రాజేష్, ఆరూరి యాకయ్య, ఆరూరి ప్రేమ్ కుమార్, కల్లెపు దర్గా స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.