Take a fresh look at your lifestyle.

రేగులపల్లిలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్

0 4

(మెట్రో న్యూస్)

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో చేపట్టిన ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ కార్యక్రమంలో భాగంగా మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం బెజ్జంకి మండలం రేగులపల్లి గ్రామంలో పర్యటించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలోని అన్ని వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, గ్రామాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉష్కం లక్ష్మి, గైని జ్యోతి, దుగ్యాని లావణ్య, గాండ్ల పద్మ, నరాల ఐలవ్వ, జంగిలి రజిత, నిషాని రాధవ్వ, ఉత్కం పద్మ, మాతంగి అనసూర్య, బోనగిరి భవాని, రేకొండ రేవతి, తాళ్ల మల్లీశ్వరి, బండారి రాధ తదితర లబ్ధిదారుల ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వారి చింతలు తీర్చేందుకే ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ కార్యక్రమం ద్వారా ప్రజల చెంతకు వస్తున్నట్లు తెలిపారు. పేదలకు సొంత ఇల్లు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
రేగులపల్లి గ్రామానికి 26 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు కేవలం ఎనిమిది ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయకముందే అదనపు ఇళ్ల కోసం కోరడం సమంజసం కాదని పేర్కొన్నారు. లబ్ధిదారులందరూ తమ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకుని గృహప్రవేశాలు జరుపుకోవాలని సూచించారు.
గ్రామ పర్యటనలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిలో ట్రాన్స్‌కోకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత ఏఈని ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జంగిలి లక్ష్మి-తిరుపతి,
ఎంపీడీవో కె. ప్రవీణ్ కుమార్, బెజ్జంకి పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్, వైస్ చైర్మన్ పర్ష సంతోష్, ఏఎంసీ మాజీ చైర్మన్ పులి కృష్ణ, ఏపీఎం పర్షరాం, ఎంపీవో ఖలీం, మండల వ్యవసాయ అధికారి సంతోష్, ట్రాన్స్‌కో ఏఈ మహేష్, ఆర్‌డబ్ల్యూఎస్‌ఏ అనిత, ఆర్ఐ, జీపీవో ప్రశాంత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కొట్టె రాజిరెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి, జీల లింగం, భైర సంతోష్, ప్రసాద్, భూమిరెడ్డి, జె. సంపత్, ఎర్రోజు రాజు తదితరులతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.