Take a fresh look at your lifestyle.

జవహర్‌నగర్ డంప్ యార్డు తరలించాలని పాదయాత్ర

0 15

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

స్థానిక ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బంది, అసౌక‌ర్యంగా ఉన్న జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్ యార్డును త‌ర‌లించాల‌ని డిమాండ్ చేస్తూ మ‌ల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేంద‌ర్ పాద‌యాత్ర చేయ‌నున్నారు. ఈ డంపింగ్ యార్డు మీథేన్ గ్యాస్ విడుదల చేయడంలో ప్రపంచ చెత్త‌ రికార్డు సాధించింద‌ని ఆయ‌న తెలిపారు. మీథేన్ వల్ల అనేక ఆరోగ్యసమస్యలు వ‌స్తున్నాయ‌న్నా ప్ర‌భుత్వాలు పట్టించుకోవ‌డం లేద‌న్నారు. చెత్త నిర్వహణపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ఈ ప్రభుత్వం వినియోగించడం లేద‌ని ఎంపీ ధ్వ‌జ‌మెత్తారు. డంప్ యార్డుకి వ్యతిరేకంగా ఈ నెల 23న జవహర్ నగర్ బాధితులతో సమావేశం ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. 25న మేధావులు, పర్యావరణ వేత్తలతో డంప్ యార్డు ఏరియాలోనే రౌండ్ టేబుల్ సమావేశం. 27 నుండి డంప్ యార్డుకి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తామ‌న్నారు.

గ్లోబల్ వార్మింగ్‌కు, వాతావరణ మార్పులకు కారణమైన ముఖ్యమైన వాటిలో మీథేన్ గ్యాస్ కూడా ఒకటి. ఉపగ్రహాల సహాయంతో ప్రపంచంలో మీథేన్ కాలుష్యం ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ఈ రిపోర్ట్ ప్రకారం జవహర్ నగర్ డంప్ యార్డు నాలుగవ స్థానంలో నిలిచింది అని సెంట్రల్ యూనివర్సిటీ నుండి వచ్చిన విద్యార్థులు ఈటలకు వివరించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. జవహర్ నగర్ డంప్ యార్డు రెండు లక్షల జనాభా కోసం ఏర్పాటు చేయబడింది. కానీ ఇప్పుడు కోటి 60 లక్షల మందికి చెందిన చెత్త ఇక్కడికి వస్తుందన్నారు.

చెత్త వ‌ల్ల యార్డు చుట్టూ 25 కిలోమీటర్ల రేడియస్‌లో భూగర్భ జలాలు విషతుల్యం అయ్యాయి. 30 కిలోమీటర్ల ప‌రిధిలో ఉన్న ప్రజలకు విషపు గాలులతో ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ సమస్యలు వస్తున్నాయి. దీనిని జనావాసాలకు దూరంగా తరలించాలని అనేక సంవత్సరాలుగా ఉద్యమం నడుస్తుంది. ఐఐటి బాంబే వారు ఇలాంటి చెత్త డంపు యార్డుల నిర్వహణ కోసం టెక్నాలజీ కూడా అందించారు.. కానీ ఈ ప్రభుత్వం వాటిని అందిపించుకోవడం లేదని ఈటెల విమ‌ర్శించారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆయ‌న‌ నిందించారు.

Leave A Reply

Your email address will not be published.