Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ లో కారు కమలం దోస్తి……

0 4

హైదరాబాద్ : మెట్రో న్యూస్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకొంటోంది.త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలపై పార్టీల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎదురైన ఓటమి నుంచి గెలుపు దిశగా పయనించేందుకు తెలంగాణలో మళ్లీ పట్టు నిలుపుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్,తెలంగాణలో అధికారం కోసం కేంద్ర నాయకత్వం కనుసన్నల్లో కలలు కంటున్న బిజెపి దూకుడు మీదున్న సీఎం రేవంత్ రెడ్డి సర్కారుకు షాక్ ఇవ్వాలని వ్యూహాలు రచిస్తున్నాయి, ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ బిజెపి మధ్య సీట్ల సర్దుబాటు కోసం రహస్య ఒప్పందం జరిగిందన్న వాదన తెరపైకి వస్తోంది, నల్గొండ ఖమ్మం వరంగల్, మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని మూడు పార్టీలు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ లు వ్యూహ త్మకంగా అడుగులు వేస్తున్నాయి, సందట్లో సడే మియా లాగా కవిత టిఆర్ఎస్,జనసేన కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధమై అభ్యర్థులను కూడా ప్రకటించింది,బిజెపి బిఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించే విషయంలో మల్ల గుల్లాలు పడుతుండగా అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల్లో ముందుంది, అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతున్న బిజెపి బీఆర్ ఎస్ లు కాంగ్రెస్ పార్టీ దూకుడు కట్టడి చేసేందుకు అంతర్గత ఒప్పందానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ స్థానాన్ని బిజెపి ఖాతాలో వేసేలా నల్గొండ వరంగల్ ఖమ్మం స్థానాన్ని టిఆర్ఎస్ కు కేటాయించేలా రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతోంది, ఇప్పటికే వరంగల్ నల్గొండ ఖమ్మం సెగ్మెంట్ నుంచి టిఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి పేరు పార్టీ పరిశీలిస్తుండగా బిజెపి ఇక్కడ లోపాయి కారిగా సహకరించే అవకాశం ఉండాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది మరోవైపు మహబూబ్నగర్ సెగ్మెంట్లో బిజెపి అధ్యక్షుడు రామ్ చందర్రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైన నేపథ్యంలో బిజెపిని గెలిపించేందుకు టిఆర్ఎస్ ఇక్కడ మద్దతు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది పొత్తు అంశంపై కాంగ్రెస్ పార్టీ విప్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఈ మధ్యకాలంలో ఆరోపణలు కూడా చేశారు ఎమ్మెల్సీ సీట్ల విషయంలో బిజెపి సర్దుబాటు చేసుకున్నాయని వెంకట్ బహిరంగం గానే ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నిక సాగుతుండడం పైగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి కూడా దీనికి అనుకొని ఉండడంతో రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లోగెలుపు, ఓటమిల ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో పార్టీ నేతలంతా క్షేత్ర స్థాయిలో ఉండి ఎన్నికల పర్యవేక్షణ చేస్తున్నారు.పార్టీ ముఖ్యమం ప్రధానంగా హైదరాబాద్ పైనే దృష్టి కేంద్రీకరించారు కేంద్రంలో బిజెపి సర్కారు వ్యతిరేకంగా సర్విశాలపై ఇండియా కూటమి ఆందోళన చేస్తున్నప్పటికీ టిఆర్ఎస్ స్పందించకపోవడం ఒప్పందంలో భాగమేమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి పైకి మాత్రం ఎవరితో పొత్తులు ఉండవని ఒంటరిగానే బరిలోకి దిగుతామని రెండు పార్టీలు ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అంతర్గత ఒప్పందం అనేది ఉందనే విషయం ప్రచారం సాగుతోంది రేవంత్ రెడ్డి తన రాజకీయ చాణిక్యం నేర్పి రెండు సీట్లను కైవసం చేసుకునే దిశలో ముందుకు సాగుతుండగా విడివిడిగా పోటీ పడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చెలి కాంగ్రెస్కు లాభం జరుగుతుందని అంచనాకు బిజెపి టిఆర్ఎస్ లో వచ్చినట్టు తెలుస్తుంది.రెండు పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి తెరవెనుక రాజకీయ వ్యూహాలు చివరికి ఎటువైపు దారితీస్తాయో, పట్టభద్రుల ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.