Take a fresh look at your lifestyle.

జాతీయ మీడియా కాంక్లేవ్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

0 18

ఢిల్లీ (మెట్రో న్యూస్‌):

అసెంబ్లీ క‌న్నా జైలుకే ఎక్కువ‌సార్లు వెళ్లాను

తెలంగాణ‌లో బీజేపీకి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు

మోదీ అన్నీ గుజ‌రాత్‌కే తీసుకెళ్తున్నారు…

ఢిల్లీలో అస్సాం దిన‌ప‌త్రిక సోమ‌వారం నిర్వ‌హించిన ప్ర‌తిదిన్‌ కాంక్లేవ్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇండియాస్ నెక్ట్స్ చాఫ్ట‌ర్ అంశంపై త‌న అభిప్రాయాల‌ను నిర్మొహ‌మాటంగా చెప్పారు. తెలంగాణ‌, ద‌క్షిణ భార‌త‌, దేశ రాజ‌కీయాలు, ప్ర‌ధాన పార్టీలు, త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం త‌దిత‌ర అంశాల‌పై మాట్లాడారు. తెలంగాణలో స్టూడెంట్ రాజ‌కీయాల్లో ఏబీవీపీ ప్ర‌భావం ఉంటే.. రాజ‌కీయాల్లోకాంగ్రెస్ ప్ర‌భావం ఉంటుందన్నారు. తాను రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన‌పుడు… తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే ప్ర‌ధానంగా ఉండేవి. ఇపుడు బీఆర్ఎస్‌, ఎన్డీయే కూడా తోడ‌య్యాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత నాయ‌క‌త్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉండ‌డంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ‌లో ప్రాధాన్యం త‌గ్గిపోయింది. దాంతో కాంగ్రెస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాను. రాహుల్ గాంధీ, దిగ్విజ‌య్ సింగ్‌, జైరాం ర‌మేశ్‌తో పాటు త‌న‌ శ్రేయోభిలాషులు కాంగ్రెస్‌లో ఉన్నారన్నారు.

రాష్ట్రంలో 2014 ఎన్నిక‌ల త‌ర్వాత పోటీ కేసీఆర్‌, రేవంత్ మ‌ధ్య పోటీగా మారింది. ఆయ‌న న‌న్ను అనేక సార్లు జైలుకు పంపారు. నేను అసెంబ్లీకి క‌న్నా జైలుకే ఎక్కువ సార్లు పోయా… గుజ‌రాత్ సీఎంగా మోదీ ఉన్న‌ప్పుడు అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ త‌న హుందాత‌నంతో వ్య‌వ‌హ‌రించి గుజ‌రాత్ అభివృద్ధి చాలా స‌హ‌క‌రించారు. మ‌న్మోహ‌న్ సింగ్ మోదీకి ఇచ్చిన మ‌ద్ద‌తులో 10 శాతం కూడా ఆయ‌న మాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు. మా రాష్ట్రానికి మెట్రో రైలు, రీజిన‌ల్ రింగు రోడ్డు, జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌డం లేదని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. నిజానికి ఇది ఉత్త‌రాది ద‌క్షిణాది అంశం కాదు.. గుజ‌రాత్‌, మిగ‌తా దేశం వ్య‌వ‌హారంలా ఉంది. మిగ‌తా అన్ని రాష్ట్రాల‌కు తేడా ఉంది.

మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా గుజ‌రాత్‌కే అన్నీ తీసుకెళుతున్నారు. బెదిరించి తీసుకెళుతున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ఎన్ని కంపెనీలు తీసుకెళ్లారు.. గుజ‌రాత్‌కు ఎన్ని తీసుకెళ్లారు. మోదీజీ … డీలిమిటేష‌న్, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల పేరుతో పెద్ద రాష్ట్రాల‌కు మ‌రింత ప్రాతినిధ్యం పెంచుతూ, చిన్న రాష్ట్రాల‌ను ఖ‌తం చేయాల‌ని చూస్తున్నారు. ఇందిరా గాంధీ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ద‌క్షిణాదికి రాష్ట్ర‌ప‌తి ఇచ్చేవారు. ముఖ్య‌మైన మంత్రిత్వ శాఖ‌లు ర‌క్ష‌ణ‌, ఆర్థిక‌, హోం ద‌క్షిణాదికి ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు మేం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ప్ర‌ధాన‌మంత్రి, హోం శాఖ‌, ర‌క్ష‌ణ శాఖ‌, వాణిజ్య శాఖ మంత్రి, అన్ని ముఖ్య‌మైన ప‌ద‌వులు ఉత్త‌రాదికి ఉన్నాయి.. ఎందుకంటే ద‌క్షిణాది సీట్లు మీకు అవ‌స‌రం లేదు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఉన్న‌ప్పుడు ఒక‌టి ఇక్క‌డ ఇస్తే, మ‌రొక‌టి అక్క‌డ ఇచ్చేవారని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.