Take a fresh look at your lifestyle.

పాఠశాలలో విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభించిన సర్పంచ్ ప్రమీల

0 2

మెట్రో న్యూస్ హత్నూర సంగారెడ్డి జిల్లా హాత్నూర మండలంలోని నస్తీపూర్ గ్రామంలో సోమవారం ప్రాథమిక పాఠశాలలో అల్పాహా పథకాన్ని సర్పంచ్ ప్రమీల సాయిలు ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పల్లెల్లో కూలీ పనులు చేసుకునే తల్లులు పిల్లలకు అల్ఫాహారం ఇవ్వకపోవడం చేత అర్థాకలితో విద్య మీద శ్రద్ధ లేకపోవడం వల్ల చదువులో వెనుకబడడం జరుగుతుందన్నారు.ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఆరోగ్యం కోసం ఆహారం అంతే ముఖ్యమని భావించి ఈ అల్పాహార పథకం మొదలు పెట్టిందన్నారు. ప్రధానోపాధ్యాయులు లోకనాధం మాట్లాడుతూ 1వ రోజు దోష, చట్నీ సాంబార్,2వ రోజు మిల్లెట్ ఇడ్లీ, సాంబార్,3వ రోజు పూరీ,మిక్స్‌డ్ వెజ్ కర్రి 4వ రోజు బోండా, చట్నీ సాంబార్ 5వ రోజు ఇడ్లీ, చట్నీ సాంబార్ 6వ రోజు ఉక్మా, చట్నీ సాంబార్ ఇస్తామన్నారు.చదువులో రాణించాలంటే ప్రతి రోజు పిల్లలను బడికి తల్లిదండ్రులు తప్పకుండా పంపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేందర్, కార్యదర్శి యాదయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు, ప్రధానోపాధ్యాయులు లోకనాధం, ఉపాధ్యాయులు నరేష్, లక్ష్మీ బాయి, బాలమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.