Take a fresh look at your lifestyle.

విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుడు బిగుళ్ల బాబు చేయూత

0 2

మెట్రో న్యూస్ బెజ్జంకి:విద్యార్థుల విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల, బెజ్జంకిలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డా. బిగుళ్ల బాబు సేవాభావాన్ని చాటుకున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా అవసరంలో ఉన్న విద్యార్థులకు పలుమార్లు ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్న ఆయన, తాజాగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులకు మరోసారి చేయూతనందించారు.
రోహిత్ వర్మ, గండ్ల కావ్య, భువనేశ్వరి అనే ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,200 చొప్పున మొత్తం రూ.6,600 అందించారు. ఈ మొత్తాన్ని రెండు జతల యూనిఫారాలు, స్టడీ మెటీరియల్ కొనుగోలు కోసం అందజేశారు.
ప్రిన్సిపాల్ ఖలీదా షిరీన్ , వైస్ ప్రిన్సిపాల్ జె. శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు నగదును అందించారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న బిగుళ్ల బాబును అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.