Take a fresh look at your lifestyle.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ గ‌ద్దె దిగాల్సిందే డిప్యూటీ సీఎం భట్టి

0 16

ఢిల్లీ (మెట్రో న్యూస్‌):

దేశ ప్రజల తరఫున, వారి ఓటు హక్కు రక్షణ కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల ప్రాథమిక ఓటు హక్కును కాలరాస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల ముంగిట వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అక్రమాలపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు మొదటినుంచీ ప్రశ్నిస్తున్నారని, అప్పట్లో వాటిని రాజకీయ విమర్శలుగా కొట్టిపారేసినప్పటికీ, ఇప్పుడు ఎన్నికల సంఘంలో తప్పులు జరుగుతున్నాయని ఎన్నికల సంఘం కమిషన్ వ్యక్తులే అంగీకరించడంతో ఆ ఆరోపణలు నిజమని రుజువయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, దేశ ప్రజల్లో ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయనే నమ్మకం సామాన్య ప్రజల్లో కూడా కలగాలంటే ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.