Take a fresh look at your lifestyle.

ఈడీ కార్యాల‌యం వ‌ద్ద బీఆర్‌ఎస్ నేత‌ల‌ ధ‌ర్నా

0 17

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్):

మంత్రి పొంగులేటిపై సోదాల వివరాలు బ‌య‌ట‌పెట్టాలి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు సంబంధిత ప్రాంతాల్లో 2024 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఈడీ నిర్వహించిన సోదాలు, అనంతరం కొనసాగిన దర్యాప్తు వివరాలను వెల్లడించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌వీ, బీఆర్‌ఎస్‌వై ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వ‌ద్ద ఆందోళ‌న నిర్వ‌హించారు. ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద్ గౌడ్, సంజయ్ పార్టీ సీనియర్ నాయకులు తలసాని సాయి, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు తొలుత అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఈడీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయగా, అనంతరం అధికారులను కలిసి లేఖ అందించేందుకు పోలీసులు అనుమతించారు. ఈడి డిప్యూటీ డైరెక్టర్ స్వాతి ని కలిసి లేఖను అందించారు.

ఈడీ సోదాలకు రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఇప్పటివరకు దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ తన లేఖలో కోరింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వెల్లడించాలని కోరింది. ఈడీ సోదాలు సుమారు 16 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగాయని, పెద్ద సంఖ్యలో అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారని పేర్కొన్నారు. సోదాల సందర్భంగా నగదు లెక్కింపు యంత్రాలను కూడా తీసుకెళ్లినట్లు మాకు స‌మాచారం ఉంది. ఈ వివరాలను 15 రోజుల్లోగా వెల్లడించాలని బీఆర్‌ఎస్ బృందం ఈడీ అధికారుల‌ను కోరింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లయితే, తదుపరి చర్యలకు సంబంధించిన కాలపరిమితిపై కూడా స్పష్టత ఇవ్వాలని అడిగింది.

Leave A Reply

Your email address will not be published.