Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేసిన ప్రముఖులు

0 14

(మెట్రో న్యూస్):

రాయికోడ్ మండలంలోని నాగ్వార్ గ్రామంలో కూనదొడ్డి దేవమ్మ/శంకరయ్యల నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశం కార్యక్రమం రాష్ట్ర వైద్యాఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో సోమవారం రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేశారు.ఈసందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.కేదార్ నాథ్ పాటిల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల,పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని,అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని,ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తామని అన్నారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోల కేదార్ నాథ్ పాటిల్,గ్రామ సర్పంచ్ గురుదాస్,మాజీ డిసియంఎస్ చైర్మన్ సిద్దన్న పాటిల్,ఏయంసి చైర్మన్ సుదాకర్ రెడ్డి,మాజీ యంపిపి భస్వరాజు పాటిల్,ఏయంసి వైస్ చైర్మన్ వినయ్ కుమార్,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీ నర్సింలు,ఏయంసి డైరెక్టర్ విఠల్,మండల కాంగ్రెస్ పార్టీ యూత్ మాజీ అధ్యక్షుడు ఎ.ప్రభాకర్,నాయకులు రాజు యాదవ్,పార్టీ సీనియర్ నాయకులు రఫిక్,సుల్తాన్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.