(మెట్రో న్యూస్):
విజయదశమి (దసరా) పండగ సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులను, సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. దుర్గామాత ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ప్రజలందరూ ఈ పండుగను శాంతియుత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య మరియు సోదరభావంతో జరుపుకోవాలని, ప్రతి అడుగు విజయవంతం కావాలని కోరుకున్నారు.