శ్రీవారి పుష్పక విమాన సేవ
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్ర ్మత్సవాల్లో ఒక అరుదైన ప్రత్యేకతగా పుష్పక విమాన సేవ నిర్వహిస్తారు. 2026 అక్టోబర్ 17న జరగనున్న పుష్పక విమాన సేవ సమయం, ఈ సేవకు సంబంధించిన ఆధ్యాత్మిక విశ్వాసాలను తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్ర ్మత్సవాల్లో నిర్వహించే ప్రత్యేకమైన వాహన సేవల్లో పుష్పక విమానం సేవ కూడా ఒకటి. మÖడేళ్లకోసారి అధిక మాసం ఏర్పడిన సందర్భాల్లో నిర్వహించే అధికమాసం నవరాత్రి బ్ర ్మత్సవాల సమయంలో మాత్రమే జరిగే అరుదైన సేవ పుష్పక విమాన సేవ ఉత్సవాల దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల కొండ భూలోక వైకుంఠంగా ఖ్యాతి చెందింది. శ్రీవారికి నిత్యోత్సవ, వారోత్సవ, పక్షౌత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాల పేరిట ఎప్పుడు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల శ్రీనివాసునికి జరిగే అన్ని ఉత్సవాల్లో బ్ర ్మత్సవాలు ప్రత్యేకమైనవి. సాత్తు బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కాబట్టి ఈ ఉత్సవాలకు బ్ర ్మత్సవాలని పేరు వచ్చాయి.
శ్రీవారి పుష్పక విమాన సేవ
సాధారణంగా ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు శ్రీవారి బ్ర ్మత్సవాలు జరుగుతాయి. ప్రతి మÖడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం ఏర్పడిన సందర్భంగా భాద్రపద మాసంలో సాలకట్ల బ్ర ్మత్సవాలు జరుగుతాయి. ఇలా అధిక మాసం వచ్చిన సంవత్సరంలో రెండోసారి ఆశ్వయుజ మాసంలో జరిగే నవరాత్రి బ్ర ్మత్సవాల్లో శ్రీవారికి అరుదైన పుష్పక విమాన సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఈ సేవ ఎప్పుడు జరగనుంది? పుష్పక విమాన సేవ విశిష్టత ఏమిటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీవారి పుష్పక విమానసేవ ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి, అక్టోబర్ 17, శనివారం రోజు ఉదయం అధిక మాసం నవరాత్రి బ్ర ్మత్సవాల్లో భాగంగా శ్రీవారి పుష్పక విమాన సేవ నిర్వహించనున్నారు.
పుష్పక విమానం తయారీ ఇలా!
శ్రీవారి పుష్పక విమాన సేవలో వినియోగించే పుష్పక విమానం తయారీ ఆద్యంతం అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన విమానం కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేస్తారు. ఈ విమానం15 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పు 750 కేజిల బరువు ఉంటుంది. ఈ పుష్పక విమానం తయారీలో 150 కేజిల మల్లెలు, కనకాంబరం, మొల్లలు, వృక్షి, చామంతి, లిల్లి, తామరపూలు, రోజా పూలు తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పాలను వినియోగిస్తారు.
మÖడు దశల్లో అలరించే పుష్పక విమానం
ఇలా తయారైన ఈ పుష్పక విమానాన్ని మÖడు దశల్లో ఏర్పాటు చేస్తారు. విమానంకు ఇరువైపులా శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుడళ్వార్ నమస్కరిస్తున్నట్లుగా, మొదటి దశలో అష్టలక్ష్ములు, రెండో దశలో ఏనుగులు, చిలకలు, మÖడో దశలో నాగ పడగల ప్రతిమలతో అత్యద్భుతంగా రూపొందిస్తారు.
పుష్పక విమాన సేవ ఉద్దేశం:
బ్ర ్మత్సవాల్లో ఐదు రోజుల పాటు వరుస వాహన సేవలు, అభిషేకాలు, పూజల్లో పాల్గొని అలసిపోయే స్వామి, అమ్మవార్లకు సేద తీర్చడానికి, విశ్రాంతినివ్వడానికి ఈ పుష్పక విమాన సేవను నిర్వహిస్తారని ప్రతీతి.
పుష్పక విమానంలో గోవర్ధన కృష్ణుడు రూపంలో శ్రీ మలయప్ప స్వామి!
అత్యంత అరుదైన ఈ పుష్పక విమాన సేవలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు ప్రత్యేకంగా గోవర్ధన కృష్ణుడు రూపంలో కానీ, కోలాట కృష్ణుడి రూపంలో కానీ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
పుష్పక విమానం తయారైంది ఇక్కడే!
తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో ఈ పుష్పక విమానం తయారవుతుందని టీటీడీ అధికారులు తెలియజేశారు. అలాగే టిటిడి వన్యసంరక్షణ విభాగంకు చెందిన వారి సహకారంతో దాదాపు వారం రోజుల పాటు శ్రమించి ఈ అద్భుతమైన విమానంను సిద్ధం చేస్తారని అధికారిక సమాచారం.
పుష్పక విమాన సేవ దర్శన ఫలం
అశేష భక్త జన గోవింద నామస్మరణల మధ్య మంగళ వాయిద్యాలు, వేద పండితుల గోష్ఠి, జానపద కళా బృందాల సంగీత, గాన కచేరీలు కనువిందు చేయగా ఆద్యంతం వేడుకగా కొనసాగే ఈ పుష్పక విమాన సేవ ఉత్సవాన్ని తిలకించిన వారికి అనేక శుభ ఫలితాలు లభిస్తాయని శాస్తం చెబుతోంది.
సకల సంపదలు, ఐశ్వర్య ప్రాప్తి
పుష్పక విమానానికి అసలైన అధిపతి సంపదలకు అధిపతియైన కుబేరుడు. బ్ర ్మత్సవాల్లో పుష్పక విమాన వాహనంపై ఉన్న శ్రీనివాసుడిని దర్శించుకోవడం వల్ల భక్తులకు దరిద్రం తొలగిపోయి, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయని విశ్వాసం.
గ్రహ దోష నివారణ, మనఃశాంతి
తులసి, మల్లెలు, గులాబీలు, పారిజాతాలు వంటి వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించిన ఈ వాహనాన్ని దర్శించడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోయి మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త వచనం.