Take a fresh look at your lifestyle.

అంగ‌రంగ వైభ‌వంగా మైసూరు ద‌స‌రా వేడుక‌లు హాజ‌రైన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

0 12

మైసూరు (మెట్రో న్యూస్‌):

కర్ణాటక రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మైసూరు దసరా ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం జంబూ సవారిలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులు, సంగీత బృందాలు, నృత్య బృందాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఊరేగింపులో పాల్గొన్నాయి. కర్నాటక రాష్ట్ర పండుగ ఉత్సవాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి, కళలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో పాటు ఎంతోమంది దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులతో కలిసి సీఎం ఈ ఉత్సవాలను వీక్షించారు.


మైసూరు రాజభవనం ముందు నిర్వహించిన ఈ దసరా వేడుకల్లో పాల్గొనడానికి ముందు ముఖ్యమంత్రి మైసూరు ప్రజల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.