Take a fresh look at your lifestyle.

సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

0 3

(మెట్రో న్యూస్) :

సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజా రంజక పాలన సాగిస్తున్నట్లు న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు.గురువారం ఐడిఓసి ఆవరణలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఏపీ జితేందర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు బొకేలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి గాంధీజీ, అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. తెలంగాణ, వందేమాతరం గీతాలను ఆలపించిన అనంతరం ముఖ్య అతిథి జాతీయ పతాకావిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రసంగిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందన్నారు.జిల్లాలో ఇప్పటివరకూ సుమారు 3.36 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారన్నారు. దీని ద్వారా మహిళలకు రూ.129.03 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు.పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు గాను జిల్లాలో రూ.53.29 కోట్లను ఖర్చు చేయడము జరిగిందన్నారు. ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో జిల్లాలో 58,113 రైతులకు సంబందించి రూ.513.99 కోట్ల పంట రుణమాఫీ చేసి చేయడం జరిగిందన్నారు.
రైతుకు పెట్టుబడి సాయం పెంచి,రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 2026-27 వానాకాలం సీజనులో 1,72,417 మంది రైతులకు రూ.263 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడము జరిగిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.